Saturday, May 15, 2021

Latest Posts

కరోనాపై ఎయిమ్స్ డైరెక్టర్ నిజం చెప్పేసారు

Dr. Randeep Guleria comments on coronavirus

కరోనా మహమ్మారికి ప్రపంచ దేశాలన్నీ గజ గజ వణికిపోతున్నాయి. ఇంతవరకూ మందు కూడా దీనికి లేకపోవడం మరింత కలవరపెడుతున్న అంశం. ఇదే సమయంలో ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పందిస్తూ, కరోనాకు మందులేదని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఈ వైరస్‌తో బాధపడుతున్న వారందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని ఆయన తేల్చేసారు. అలాగే వారి సన్నిహితులు కూడా బాధితుల్లో ఉన్నారని పేర్కొన్నారు. వేడి వాతావరణంలో కోవిడ్-19 తీవ్రత క్రమంగా తగ్గి ఆ తర్వాత కనుమరుగవుతుందన్న వార్తలను కూడా గులేరియా కొట్టిపడేశారు.

అలా అయితే.. వేడి, చల్లని వాతావరణాలు గల సింగపూర్, యూరోపియన్ దేశాల్లోనూ ఈ వైరస్ విజృంభిస్తోందన్న విషయాన్ని డాక్టర్ రణదీప్ గుర్తు చేశారు. లవంగాలు, ఇతర మూలికలు కరోనా వైరస్‌ను నిలువరిస్తాయని చెప్పలేమన్నారు. కోవిడ్-19కు నిర్దిష్ట లక్షణాలు అంటూ ఏమీ ఉండవని డాక్టర్ రణదీప్ చెబుతూ.. జ్వరం, దగ్గు, గొంతులో మంట, జలుబు, ఒళ్లు నొప్పులు వంటివి ఉంటాయన్నారు. కొందరిలో కడుపునొప్పి, డయేరియా వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయన్నారు. కరోనా వైరస్‌కు ఔషధం లేదని, నివారణ ఒక్కటే మార్గమన్నారు.

దీని బారిన పడకుండా ఉండాలంటే చేయాల్సింది ఒక్కటేనని, అది వ్యక్తిగత పరిశుభ్రత ఒక్కటేనని ఆయన స్పష్టం చేసారు పరిశుభ్రంగా ఉండడం వల్ల కరోనా వైరస్‌ నుంచి తప్పించుకోవచ్చని అన్నారు. అలాగే, మాంసాహారం, గుడ్లు తినడం వల్ల కరోనా వైరస్ సోకుతుందన్న వార్తల్లో నిజం లేదని గులేరియా తేల్చి చెప్పారు. ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి మాత్రమే సోకుతుందని, మాంసాహారం, గుడ్లు తినడం వల్ల కాదని స్పష్టం చేశారు. మాంసాహారం వండుకునేటప్పుడు సాధారణంగా తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. మాసం శుభ్రంగా కడుక్కుని, సరిగా ఉడికించి తీసుకోవాలన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss