ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీకి ఎట్టకేలకు అనుమతులు లభించాయి. బుధవారం (మే 13) న ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి శ్రీకాకుళంలో లాబొరేటరీ పెట్టడానికి అనుమతులు లభించయని తెలిపారు. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ శ్రీకాకుళం లో ఏర్పాటుచేసిన ఔషధ ఉత్పత్తి సంబంధిత ప్లాంటుకు అమెరికా కేంద్రంగా పనిచేసే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్.డి.ఎ) నిరభ్యంతర సర్టిఫికెట్ ఇచ్చింది. శ్రీకాకుళం ప్లాంటులో ఔషధ సంబంధిత ఉత్పత్తులైన జనరిక్ బయో మిల్లర్లు ఉత్పత్తి చేస్తామని తెలిపారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కార్డియో డయాబెటిక్స్, అంకాలజీ విభాగాలలో ఔషధ ఉత్పత్తి చేయనున్నట్లు లాబరేటరీ ప్రతినిధి తెలిపారు.
ఇది కూడా చదవండి:MSME ప్యాకేజ్ భారతదేశానికి ఎలా ఉపకరిస్తుంది ?