Wednesday, December 1, 2021

Latest Posts

టీం ఇండియా డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్

Dressing room secrets in cricket history

క్రికెట్‌లో బ్యాట్ మరియు బాల్ గేమ్ మధ్య పోటీకి డ్రెస్సింగ్ రూమ్‌లు డెన్‌లుగా ఉంటాయి.  ఇక్కడ టీమ్ మేనేజ్‌మెంట్ మరియు ప్లేయర్‌ల మధ్య ప్లానింగ్ మరియు ప్రిపరేషన్లు జరుగుతాయి. ఈ ప్లానింగ్, ప్రిపరేషన్ వల్ల  ఆట ఆడే విధానం, ప్లేయర్‌ యొక్క పనితీరు మెరుగవుతుంది. అలాగే ఆట ప్రధాన భాగంలో చర్చించడమే కాకుండా, డ్రెస్సింగ్ రూమ్‌లు ఒక సామాజిక ఛాంబర్‌గా కూడా ఉండటం వల్ల ఇక్కడ ప్రతి క్రికెటర్ ఆనందంగా మరియు ఇతర ప్లేయర్స్ తో  స్నేహపూర్వక సత్సంబందాలు ఏర్పడతాయి.  మైదానం లోనే కాకుండా డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగే చిలిపి సంఘటనలు చాలా విచిత్రంగా మరియు ఆహ్లాదకరమైనవిగా ఉంటాయి. వాటిని కొన్ని సందర్బాలలో ప్లేయర్స్ బహిరంగంగా పంచుకుంటారు. అవి చిరకాల జ్ఞాపకాలుగా వారు తెలియజేస్తారు. అలా బహిర్గతం చేసిన వాటిలో నుండి ఒక సరదా ఒక సన్నివేశాన్ని మనం ఈ రోజు తెలుసుకుందాం.

2005 లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టీమిండియాకు నాయకత్వం వహించినప్పుడు జరిగిన సంఘటన. అప్పటి  టీం ఇండియా లో వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ మరియు యువరాజ్ సింగ్ వంటి ప్రముఖ ఆటగాళ్ళు ఉన్నారు.  కొచ్చిలో పాకిస్తాన్‌తో ఆట జరుగుతున్నా రోజున, ఆట మొదలవకముంది కెప్టెన్ సౌరవ్ గంగూలీ టీమ్ అందరిని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేస్తారు.అయితే ఆ ఆట జరుగుతున్నా రోజు ఏప్రిల్ ఫస్ట్ కావడంతో ఏప్రిల్ ఫూల్ డే ను పురస్కరించుకొని యువరాజ్ సింగ్ మరియు హర్భజన్ సింగ్ మరికొందరు టీమ్ ఇండియా సభ్యులతో కలిసి దాదాపై భారీ చిలిపి చేష్టలు చేశారు. జట్టు సమావేశాన్ని నిర్వహిస్తున్నప్పుడు, యువరాజ్, హర్భజన్ మరియు సెహ్వాగ్ ఒక వార్తాపత్రిక యొక్క నకిలీ ముద్రణను తీసుకువచ్చి గంగూలీకి చూపించి ఎంటిదని అడిగారు. గంగూలీకి ఇచ్చిన పేపర్లో అతని యొక్క కొన్ని ఊహాజనిత ఇంటర్వ్యూను హైలైట్ చేస్తు, తోటి ఆటగాళ్లను తీవ్రంగా విమర్శింస్తు ఉన్నపోస్టల్ ను చూసాడు.

కానీ గంగూలీ దానిని జాగ్రత్తగా చదవడంతో, వెంటనే ఏ ఇంటర్వ్యూలోనూ అలాంటిదేమీ చెప్పలేదని స్పష్టం చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఇతర టీమ్ సభ్యులు వెనక్కి తగ్గలేదు, చివరికి నిరాశతో కెప్టెన్‌ని తన కెప్టెన్సీని వదులుకోవాల్సి వచ్చేంత పని అయ్యింది.  కానీ వైస్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ గంగూలీని ఎగతాళి చేయడాన్ని తట్టుకోలేకపోయాడు, అప్పుడు అతను నవ్వుతు, చివరికి మొత్తం పరిస్థితిని కెప్టెన్‌కి చిలిపిగా వెల్లడించాడు. దాంతో తేరుకున్న దాదా ఉపిరి పీల్చుకున్నాడు. దాంతో దాదా నవ్వుకొని చిలిపిగా అందరిని బ్యాట్‌ తో కొట్టడానికి ప్రయత్నిచాడు. ఇలాంటి  మరికొన్ని  టీం ఇండియా డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ లో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మరిన్ని తాజా వార్తలు కోసం చూస్తూనే ఉండండి 99తెలుగు చానల్.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss