drone-based surveillance was formally launched by Commissioner Mahesh Bhagwat
లాక్ డౌన్ లో భాగంగా రోడ్ల పైకి వచ్చిన రెండు వేల వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశాం. అంతేకాకుండా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో ఆరుగురిని అరెస్టు చేయడం జరిగింది అని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. అలాగే రాచకొండ కమిషనరేట్ పరిధిలో కొన్ని ప్రాంతాలను హాట్ స్పాట్ జోన్లుగా చేసినట్లు, పాజిటివ్ కేసులు నమోదు అయిన చోట డ్రోన్ కెమెరాల సాయంతో నిఘా పెట్టినట్లు తెలిపారు. వీటిలో బాగంగా మౌలాలి, పహాడీ షరీఫ్, బాలాపూర్లను హాట్ స్పాట్లుగా గుర్తించగా, ఆయా ప్రాంతాల్లో డ్రోన్లను ప్రయోగిస్తున్నట్లుగా వెల్లడించారు.
ఢిల్లీ మార్కజ్ యాత్రకు వెళ్లి వచ్చిన 98 మందిని ఈ డ్రోన్ కెమెరాలతో గుర్తించి నట్లు, ఇప్పటి వరకు రాచకొండ కమిషనరేట్‌లో పరిదిలో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అని తెలిపారు. ప్రస్తుతానికి వారిలో ముగ్గురు డిశ్చార్జ్ అయ్యి నట్లు మిగిలిన 14 మంది గాంధీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటునట్లు తెలిపారు. ఈ రోజు కూడా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదుఅయ్యాయని హోమ్ క్వరంటాయిన్ లో 2 వేల మంది ఉనట్లు తెలిపారు. ప్రజలందరు లాక్ డౌన్‌ను విధిగా పాటించి పోలీసులకు సహకరించాలి అప్పుడే కరోనా నియంత్రించడంలో మనం విజయం సాధించగలం అన్నారు.