Tuesday, April 13, 2021

Latest Posts

దృశ్యం 2 రిలీజ్ డేట్ వచ్చేసింది

Drushyam 2 Movie Gets Release Date

అనుకోని ఆపదల నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమార్తెను ఓ తండ్రి ఎలా కాపాడుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కిన ‘దృశ్యం’ సినిమాకి సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మలయాళంలో ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం 2’ సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా తొలి భాగం రీమేక్‌లో నటించిన వెంకటేష్, మీనా మళ్ళీ సీక్వెల్‌ రీమేక్‌లోనూ నటిస్తున్నారు.

మాతృకను డైరెక్ట్‌ చేసిన జీతూ జోసఫే తెలుగు రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ కేరళలో జరుగుతోంది. ఇప్పటికే యాభై శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ‘దృశ్యం 2’ సినిమాను ఫాదర్స్‌ డే సందర్భంగా జూన్‌ 20న విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారట చిత్రబృందం. కుటుంబం కోసం ఓ తండ్రి పడే ఆవేదనలో ఈ సినిమా కథనం సాగుతుంది కాబట్టి ఆ రోజు అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss