దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాదించారు. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందడంతో దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తరపున రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాతకు టీఆర్ఎస్ తరుపున పోటి చెయ్యగా బీజేపీ తరపున రఘునందన్ రావు పోటిలో నిలిచారు. ఇక కాంగ్రెస్ తరపున చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు. కానీ టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై 1118 ఓట్ల మెజార్టీతో రఘునందన్‌రావు గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి బీజేపీ – టీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా సాగినా చివరాకరికి బీజేపీ నే విజయం వరించింది.
కాగా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 198807 ఓట్లు ఉండగా 164192 ఓట్లు పోలయ్యాయి. అయితే వీటిలో 162516 ఓట్లను లెక్కించారు. మిగిలినవి ఈవీఎంలలో ఉండిపోయాయి. 23 రౌండ్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత టీఆర్ఎస్కు 61302 ఓట్లు, బీజేపీకి 62772 ఓట్లు, కాంగ్రెస్‌కు 21819 ఓట్లు పోలయైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక ఈ ఎన్నికల్లో నోటాకు 552 ఓట్లు రావడం విశేషం. మొత్తం 23 మంది అభ్యర్థులు దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేయగా 11 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
ఇది కూడా చదవండి: