హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం. వీటితో పాటు సైబర్ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న నగరానికి ఈ కొత్త నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రపంచంలోని పెద్ద కేబుల్ వంతెనలలో ఇది కూడా ఒకటి కావడం విశేషం. ఈ బ్రిడ్జి రాకతో దుర్గం చెరువు ప్రాంతం పర్యటకంగా మరింత అభివృద్ధి చెందనుంది. అయితే, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అద్భుతమైన కట్టడం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహోర్తం ఖరారైంది. శుక్రవారం సాయంత్రం 5.30 నిమిషాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ రామ్మోహన్ ప్రారంభించనున్నారు.
మాదాపూర్ వద్ద దుర్గం చెరువుపై రూ.184 కోట్ల వ్యయంతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి. ఇక్కడ ఏర్పాటు చేసి లైటింగ్ రాత్రివేళ వంతెన అందాన్ని మరింత పెంచేలా ఉంది. అటు జుబ్లీ హిల్స్ రోడ్ నం. 45ను ఐటీ కారిడార్‌ను అనుసంధానం చేయనుంది. ఈ కేబుల్ వంతెన ప్రారంభించడం ద్వారా చాలా మంది ప్రయాణికులకు కొన్ని కిలో మీటర్ల దూరం ప్రయాణ భారం తగ్గుతుంది. అంతే కాదు శని, ఆదివారాల్లో ఈ కేబుల్ వంతెన పైకి వాహనాలు అనుమతి చేయకుండా కేవలం సందర్శనకు మాత్రమే అనుమతులు ఇవ్వనున్నారు అధికారులు. ఈ కేబుల్ వంతెనను సందర్శనకు వచ్చిన వారి వాహనాలు పార్కింగ్ చేయడానికి కూడా స్థలాన్ని ఏర్పాటు చేసారు.
ఇది కూడా చదవండి: