Tuesday, April 13, 2021

Latest Posts

ఈ కామర్స్ కేవలం వాటికే పరిమితం  

e-commerce companies need only distribute essentials says piyush goyal

లాక్‌డౌన్‌  నిబంధనలు సడలింపులో ఈ కామర్స్ కార్యకలాపాలకు మొదట్లో అనుమతి ఇవ్వాలని భావించిన కేంద్రం ఆతర్వాత దీనివలన  ప్రభావితమయ్యే వీలుండటంతో.. ఈ- కామర్స్‌ సంస్థలకు నిత్యావసర వస్తువుల సరఫరా తప్ప మిగిలినవి కుదరవని స్పష్టంచేసేసింది. అందుకే వాటికి ఇచ్చిన  మినహాయింపులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. నిజానికి  మొబైల్‌ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌ లు, లాప్‌టా్‌పలు, రెడీమేడ్‌ దుస్తులు, స్టేషనరీ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించేలా నాలుగు రోజుల క్రితం కేంద్రం వెసులుబాటు కల్పించింది.

అయితే, రాబోయే సమస్యలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాన్ని కేంద్రం  వెనక్కుతీసుకుంది. ఈ కామర్స్‌ సంస్థలు నిత్యావసరాలు మాత్రమే పంపిణీ చేయాలని, మిగతావాటిపై లాక్‌డౌన్‌ ఉన్నంతకాలం నిషేధం కొనసాగుతుందని హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా స్పష్టమైన  ఆదేశాలు జారీ చేశారు. సవరించినమార్గదర్శకాలతో రాష్ర్టాలకు లేఖ కూడా రాశారు.    ఈ నిర్ణయంతో రిటైలర్లకు, ఈ-కామర్స్‌ కంపెనీలకు సమప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ పేర్కొన్నారు.

కాగా, కేంద్రం మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని అమెజాన్‌ ఇండియా తెలిపింది. వినియోగదారులు, చిన్న వ్యాపార సంస్థలు, అమ్మకందారులు, తయారీదారులకు ఇది తీవ్ర నిరాశ గా పేర్కొంది. నిత్యావసర సరుకుల పరిధిని విస్తృతం చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందని పేటీఎం మాల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ మోతె, ఆర్‌ఏఐ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కుమార్‌ రాజగోపాలన్‌ తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss