Thursday, December 2, 2021

Latest Posts

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ – తెలంగాణ ఎంసెట్ కన్వీనర్

Eamcet examination guidelines

ఆగస్టు 4 నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను మొత్తం ఆరు సెషన్లలో నిర్వహిస్తున్నారు. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా మొత్తం 105 పరీక్షా కేంద్రాలను(తెలంగాణలో 82, ఏపీలో 23) ప్రవేశ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. కాగా, ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉండటంవల్ల నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పారు తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్.  రెండు గంటల ముందే పరీక్ష కేంద్రంలో పలికి అనుమతిస్తామని వెల్లడించారు. హాల్ టికెట్‌పై లొకేషన్ కూడా ఇస్తున్నామన్నారు. విద్యార్థులు ఒక రోజు ముందే ఎగ్జామ్ సెంటర్ తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థులు తప్పని సరిగా కరోనా కట్టడి నియమాలను పాటిస్తూ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss