Tuesday, May 18, 2021

Latest Posts

ఇరాన్ ‌లో భూకంపం..

ఉత్తర ఇరాన్‌లో ఈ రోజు శుక్రవారం(8 మే)  తెల్లవారుజామున 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.  భూకంపం ప్రభావంతో దానిని  తప్పించుకునే ప్రయత్నంలో టెహ్రాన్ తూర్పు భాగంలో ఒకరు మరణించారని ఉత్తర ఇరాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి కియానుష్ జహన్‌పూర్  సోషల్ మీడియా ద్వారా ఈ ఘటనకు సంబందించిన విషయాలను తెలిపారు అధికారులు సహాయక చర్యలు చేస్తున్నారని ఈ సందర్బంగా  మంత్రి చెప్పారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిత్రాలు అర్ధరాత్రి టెహ్రాన్ వీధుల్లో ప్రజలు భూకంపం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు చూపబడ్డాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ( USGS) ప్రకారం, భూకంపం యొక్క కేంద్రాన్ని దమావండ్ వద్ద, 10km లోతు (6.2 మైళ్లు)లో గుర్తించారు.

ఇది కూడా చదవండి:విశాఖలో NDRF బృందాలు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss