Wednesday, December 1, 2021

Latest Posts

ఐదు వేల మొక్కలు నాటిన కర్ణాటక యువకుడు

Eco warrior planted 5000 trees

కర్ణాటకకు హసన్ జిల్లా, గూడెనహళ్లి గ్రామానికి చెందిన కేఆర్ గిరీశ్(20) అనే విద్యార్థి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన ఇప్పటి వరకు ఏకంగా 5,000 మొక్కలు నాటాడు. ప్రస్తుతం బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నా తనకు 12 ఏళ్లు వచ్చినప్పటి నుంచే మొక్కలు నాటడం మొదలు పెట్టారు. ఆయన తల్లి పేరు లత తండ్రి రమేష్ లు ఇద్దరూ కూలీలు. ప్రకృతిపై గిరిశ్‌కు ఉన్న ప్రేమతో ఆర్థిక స్తోమత అంతతగానే ఉన్నా అతడు మొక్కలను నాటుతున్నారు. కాగా ఈ విషయంపై గిరిశ్‌ను అడిగితే “మన పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. కాలుష్యం విషయంలో ఇతరులను నిందించడం అర్థం లేని పని. ప్రకృతిని కాపాడటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.

ఇందుకు నేను నా వంతు కృషి చేస్తూనే ఉంటాను. ఈ కార్యక్రమంలో చాలామంది నాతో చేతులు కలపడం సంతోషంగా ఉంది. నా స్నేహితులు, టీచర్లు, తల్లిదండ్రుల మద్దతుతోనే ఇన్నేళ్లుగా మొక్కలు నాటుతున్నాను. వారు నాకు ఎంతగానో మద్దతిస్తున్నారు” అని అన్నారు. ఇప్పటి వరకు గిరీశ్ బెంగళూరు, హాసన్ నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాల చెట్లను నాటారు. తక్కువ వయసులోనే పర్యావరణ పరిరక్షణ కోసం ఇంత కృషి చేస్తున్న గిరీశ్ సేవలను ప్రముఖులు, సాధారణ ప్రజలు ప్రశంసిస్తు గిరీశ్ ను అందరు ఆదర్శంగా తెసుకోవాలని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss