Sunday, June 20, 2021

Latest Posts

ఒకే కుటుంబంలో 8 మంది మరణం కుటుంబంలో తీరని విషాదం

Eight People Died From The Same Family In Imaliya

లక్నో శివార్లలో ఉన్న ఇమాలియా గ్రామంలో ధుఖం చోటు చేసుకుంది. ఏప్రిల్ 25 మరియు మే 15 మధ్య 20 రోజుల వ్యవధిలో ఒక కుటుంబంలోని ఏడుగురు వ్యక్తులు మరణించారు. దీనితో ఎనిమిదవ వ్యక్తి ఈ మరణాల షాక్ ని తట్టుకోలేక గుండె పోటుతో మరణించాడు.

మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. ఇప్పుడు కుటుంబానికి చెందిన పెద్ద అయిన ఓంకర్ యాదవ్ మాట్లాడుతూ, “నా నలుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు మరియు తల్లి కోవిడ్తో ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. నా అత్త షాక్ భరించలేకపోయింది మరియు ఆమె గుండెపోటుతో మరణించింది.”

“నేను ఉదయం నా తల్లి చివరి కర్మలు చేశాను, తరువాత అదే రోజు ముగ్గురు సోదరులను దహనం చేశాను. తరువాతి రోజుల్లో నా తమ్ముడు మరియు ఇద్దరు సోదరీమణులు మరణించారు. తమ కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ వారికి ఆక్సిజన్ పడకలు, సరైన చికిత్స అందలేదని యాదవ్ తెలిపారు.

ఈ సంఘటన పై మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఒక్క ప్రతినిధి కూడా గ్రామాన్ని సందర్శించలేదని గ్రామ పెద్ద మేవరం అన్నారు. మరణాలు ఉన్నప్పటికీ, గ్రామంలో పారిశుధ్యం జరగలేదని ఆయన అన్నారు. మమ్మల్ని కాపాడటానికి ఎవరూ ముందుకు రాలేదని చికిత్స లేకుండా చనిపోవడానికి మేము మిగిలిపోయాము, అన్నారాయన.

చాలా మంది తల్లిదండ్రులు అకస్మాత్తుగా ఎందుకు అదృశ్యమయ్యారో కుటుంబంలోని పిల్లలకు ఎలా చెప్పాలో తెలియడం లేదని, మృతదేహాలు వచ్చినప్పుడు మేము వారిని పొరుగువారి ఇంటికి పంపించాము. తప్పిపోయిన వారు త్వరలో తిరిగి వస్తారని వారు ఇప్పటికీ భావిస్తున్నారు, అని అతను చెప్పారు.

“తల్లిదండ్రులను కోల్పోయిన ఈ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు మమ్మల్ని ఎవరూ సంప్రదించకపోవడంతో మాకు ఏమైనా ప్రభుత్వ సహాయం ఉంటుందో లేదో మాకు తెలియదు” అని చనిపోయిన కుటుంబ సభ్యులలోని ఒక వ్యక్తి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss