Sunday, June 20, 2021

Latest Posts

ఏక్ మినీ కథతో యువీ క్రియెషన్స్ జాక్ పాట్

Ek Mini Katha Pre Release Business

యువీ క్రియెషన్స్ చిన్న సినిమాతో పెద్ద జాక్ పాట్ కొట్టేసినట్లు తెలుస్తుంది. సాధారణంగా పెద్ద సినిమాలను తెరకెక్కించే ఈ సంస్థ ఈ సారి చిన్న సినిమా పై కన్నెసింది. దర్శకుడు మేర్లపాక మురళి సూపర్ విజన్ లో నిర్మించిన సినిమా సినిమా ఏక్ మినీ కథ ను యువీ క్రియెషన్స్ ఓటిటికి అమ్మేసారు.

మొదట్లో ఈ సినిమా థియేటర్ లో విడుదల చేయాలని ఈ సినిమాని నిర్మించింది యువీ క్రియెషన్స్ అయితే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవడం అసాధ్యం అన్న క్లారిటీ రావడంతో ఓటిటికి విక్రయించేసారు. తొమ్మిది కోట్లకు కాస్త అటు ఇటుగా అమ్మేసారని తెలుస్తోంది. సంతోష్ శోభన్ హీరోగా తీసిన ఈ సినిమా చిన్న సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తయారైంది.

కాస్త అడల్డ్ కామెడీ టచ్ వున్న ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వారికి అమ్మినట్లు తెలుస్తుంది. ఎంత కాదన్నా అయిదు కోట్లకు పైగానే యువికి లాభం వుంటుందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మే నెలాఖరులో ఈ సినిమా ఓటిటిలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss