Sunday, June 20, 2021

Latest Posts

ఏక్ మినీ కథ రిలీజ్ డేట్ వాయిదా పడింది

Ek Mini Katha Release Date

సంతోష్ శోభన్ మరియు కావ్య తాపర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఏక్ మినీ కథ, కరోనా యొక్క సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేశారు.  ఈ విషయాన్ని వెల్లడించడానికి వినూత్న పద్ధతిలో కొత్త వీడియోను విడుదల చేశారు చిత్ర బృందం.

కోవడ్ వ్యాప్తితో ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని, సినిమాలను విడుదల చేయడానికి ఇది సరైన సమయం కాదని ఈ సినిమా హీరో సంతోష్ చెప్పారు. కొంతకాలం క్రితం ప్రకటించినట్లు ఏక్ మినీ కథ ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కావడం లేదని ఆయన అన్నారు. కొత్త విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇకపోతే ఈ ఏక్ మినీ కథ సినిమాను రాము కొప్పుల దర్శకత్వం వహించగా, దివ్య విజయ్ నిర్మిస్తుండగా యువీ కాన్సెప్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కింది. మరి వాయిదా పడిన ఈ కామెడీ చిత్రం ఓటిటీ లో వస్తుందా అనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss