Monday, May 10, 2021

Latest Posts

వృద్ధులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం వయసు పైబడిన వారికి మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. వృద్ధులకు ఆసరాగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం  ప్రధానమంత్రి వయ వందన యోజన స్కీమ్‌ను తీసుకొచ్చింది.  ఈ స్కీమ్‌ను మరో మూడేళ్ల పాటు కొనసాగించనున్నారు. దీనికి కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదముద్ర వేసిన్నట్లు తెలుస్తుంది. అయితే ఇది  ఎల్‌ఐసీ ద్వారా కొనసాగించే ఈ పథకం ఇప్పుడు 2023 వరకూ అందుబాటులో ఉండనుంది. ఇక  60 సంవత్సరాలు  పైబడి లేదా పదవీ విరమణ అనంతరం ఆదాయం గురించి చింత లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది అని తెలిపారు.

అయితే  10 ఏండ్ల కాల పరిమితికి వర్తించే ఈ పథకంలో చేరే వృద్ధులు ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ పాలసీని కొనుగోలు చేసేందుకు వయసు ధ్రువీకరణ గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంకు వివరాలు తప్పనిసరిగా  ఉండవలసిందే, దీనికి ఒక్కసారి ప్రీమియం చెల్లించి పాలసీని కొనుగోలు చేస్తే చాలు  ఈ పథకం ద్వారా సంవత్సరానికి 8.3 వడ్డీని పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా నెలకు రూ.1000 నుంచి 5 వేల రూపాయల వరకూ పెన్షన్ అందుతుంది. అలాగే అత్యవసర వైద్య సహాయానికి లేదా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా ఈ పాలసీని స్వాధీన పరిచి డబ్బు పొందే వీలు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే పాలిసీదారునీకే  కాకుండా తన  జీవిత భాగస్వామి అవసరాలకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు కానీ ఈ స్కీమ్ కేవలం సీనియర్ సిటిజన్ల కోసమే.

ఇది చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss