Saturday, May 8, 2021

Latest Posts

2021 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

Election Results 2021 India

దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లల్లో జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అధికార పార్టీలు మళ్ళీ గెలుస్తాయా లేక ప్రతి ప్రక్ష పార్టీలు అధికారంలోకి వస్తాయా ఎవరు గెలుస్తారు ఈ ఉత్కంఠ ఈ రోజు సాయంత్రం లోపు వీడనుంది.

అయితే ఈ ఐదు రాష్ట్రాలలో ఎక్కువగా పశ్చిమబెంగాల్‌లో ఎవరు గెలుస్తారనే దాని పై దేశమంతా చర్చ నడుస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అధికార పార్టీ తృణముల్‌ కాంగ్రెస్కు, భారతీయ జనతా పార్టీ మధ్య హోరాహోరి పోరు నడుస్తుంది. టీఎంసీకి, బీజేపీ చెక్ పెడుతుందా..? లేక మళ్లీ టీఎంసీనే పాగా వేస్తుందా అనేది హాట్ టాపిక్‌గా మారింది.

ఇకపోతే ఆదివారం ఉదయం 8 గంటల నుంచి అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రానికి ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది.

పశ్చిమ బెంగాల్‌:

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో 292 సీట్లలో పోలింగ్ నిర్వహించారు. కరోనా కారణంగా ఇద్దరు అభ్యర్థులు మరణించడంతో ఆ ప్రాంతాల్లో ఎన్నికలను వాయిదా వేశారు. అయితే టి‌ఎం‌సి 189 స్థానాల్లో ముందుంజలో ఉండగా బి‌జే‌పి 89 స్థానాలను దక్కించుకుంది.

అస్సాం:

అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు మొత్తం మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేశారు. ఇక్కడ అధికార పార్టీ బీజేపీ, కాంగ్రెస్ + ఎఐయూడీఎఫ్ కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే అస్సాంలో బి‌జే‌పి 56 స్థానాల్లో ఆధిక్యం సాధించి ముందుంజలోకి దూసుకు వెళ్లింది.

తమిళనాడు:

తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకేదశలో పోలింగ్ జరిగింది. 71.43 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 234 స్థానాలున్నతమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకుంది. ప్రస్తుతానికి డీఎంకే 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అన్నాడీఎంకే 93 స్థానాల్లో ముందంజలో ఉంది.

కేరళ:

140 సీట్లున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. 73.58శాతం పోలింగ్ నమోదయింది. ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య పోటీ జరిగింది. అయితే ఎల్‌డిఎఫ్‌, సిఎం పినరయి విజయన్‌ 93 సీట్ల ఆధిక్యంతో విజయం వైపు దూసుకుపోతున్నారు.

పుదుచ్చేరి:

ఇక్కడ 30 మంది సభ్యుల శాసనసభకు ఒకే దశ ఎన్నికలు ఏప్రిల్ 6న జరిగాయి. ఏఐఎన్‌ఆర్‌సి 6 సీట్లలో, బిజెపి 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. డీఎంకే పార్టీ కూడా ఒక స్థానంలో ముందంజలో ఉంది.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss