electricity Bills should be paid same this month in March
లాక్డౌన్ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని, కరెంట్ బిల్లులనూ మూడు నెలల పాటు కట్టాల్సిన అవసరం లేదంటూ జరుగుతున్న ప్రచారంలో ఎమాత్రం నిజం లేదని ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరినాథరావు తెలిపారు. ఈనెల 4వ తేదీలోగా ఎస్ఎంఎస్ ద్వారా విద్యుత్ బిల్లులను వినియోగదారులకు పంపుతామని ఓ ప్రకటనలో తెలిపారు.
ఎల్టీ ఆక్వా, హెచ్‌టీ మీటర్ సర్వీసులకు మాత్రం మీటర్ రీడింగ్ ప్రకారమే విద్యుత్ బిల్లులను జారీ చేస్తామన్నారు. ఈ మేరకు జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే తెలంగాణలో కూడా గత నెల కరెంటు బిల్లులే ఈ నెలలోనూ చెల్లించాల్సి ఉంటుందని డిస్కమ్‌లు కోరనున్నాయి. లాక్డౌన్ కారణంగా విద్యుత్ సరాఫరా వ్యవస్థలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అన్నిజాగ్రతలు తీసుకునట్లు, కీలకమైన అన్ని విభాగాల్లో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.