Thursday, December 2, 2021

Latest Posts

ఈటల రాజేందర్‌ అస్వస్థత

Etela Rajender Health Condition

కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గవ్యాప్తంగా మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ ‘ప్రజా దీవెన యాత్ర’ పేరిట పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం చేపడుతున్న ఈటల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వీణవంక మండలం కొండపాక వరకూ పాదయాత్ర కొనసాగించి మధ్యాహ్న భోజనం ముగించిన అనంతరం బాగా నీరసించిపోవాదంతో వెంటనే వైద్యులు పరీక్షలు చేశారు.  అలుపెరగకుండా పాదయాత్ర చేస్తుండడంతో ఆయన జ్వరంతోపాటు కాళ్లనొప్పులతో బాధపడుతున్నారని వైద్యులు పరీక్ష అనంతరం  బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తెలిపారు. ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. పాదయాత్రను బ్రేక్‌ లేకుండా ఎండావానకు తడుస్తూ కొనసాగిస్తుండడంతో ఈటల నీరసించిపోయారని ఈటల వర్గీయులు చెబుతున్నారు. అయితే పాదయాత్రను బ్రేక్‌ వేయకుండా ఈటల సతీమణి జమున పాదయాత్ర కొనసాగిస్తారని సమాచారం.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss