Monday, July 26, 2021

Latest Posts

మరో కీలక పదవికి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్

Etela Rajender Resigns As President

టిఆర్ఎస్ కు రాజీనామా చేసిన కొన్ని రోజుల తరువాత, మాజీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మరో కీలక పదవికి రాజీనామా చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఈటెల. పార్టీ నుంచి బహిష్కరించబడిన ఈ టిఆర్ఎస్ నాయకుడు సోమవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక తన రాజీనామా లేఖను ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శికి పంపారు. 2014 నుండి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నారు.

ఇప్పుడు ఈ పదవి ఖాళీ కానుండడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవిని త్వరలో మంత్రి కేటీఆర్‌కు ఇవ్వడానికి పాలకమండలి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జి. కిషన్ రెడ్డి సమక్షంలో ఈటెల రాజేందర్ సోమవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఆయన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss