Etela Rajender said in a press conference that some fools are attacking doctors.
బ్రిటన్ ప్రధాని కరోనా నుంచి కోలుకున్న తర్వాత నాకు ఆ దేవుడు లేడు వైద్యుడే దేవుడు అన్నాడని అలాంటి వైద్యులపై కొందరు మూర్ఖులు, షాడిస్టులు దాడి చేస్తున్నారని అలాంటి వారిని ఉపేక్షించేది లేదని విలేకరుల సమావేశంలో తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వైద్యులపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని అన్నారు.
సాక్షాత్తూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా మహమ్మారి నుంచి తన ప్రాణాలను కాపాడిన వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారని ఈ సందర్బంగా ఈటల ప్రస్తావించారు. వైద్యులు వాళ్ళ కుటుంబాన్ని పక్కనపెట్టి విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్లపై దాడి చేస్తే పేషంట్లను కూడా శిక్షించేలా ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేసామని ఆయన అన్నారు. శనివారం టీఎన్జీవో ఆధ్వర్యంలో నారాయణగూడలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ శిబిరంలో దాదాపు 200 మంది టీఎన్జీవో ఉద్యోగులు రక్తదానం చేసినట్లు తెలిపారు.