Thursday, December 2, 2021

Latest Posts

ఎన్నికల్లో చూసుకుందాం రండి – ఈటల సవాల్

Etela Rajender Speech At Huzurabad

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం చెల్పూరులో బీజేపీ నేత ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సంధర్బంగా ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన పలువురు భాజపాలో చేరగా ఆయన పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈటల మాట్లాడుతూ నేను హజూరాబాద్‌ ప్రజల గుండెల్లో చోటున్న బిడ్డను. త్వరలో జరగనున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ధైర్యముంటే తనపై పోటీ చేసి గెలవాలని. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులకు బీజేపీ నేత ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. మీరు దళిత బంద్ ఇచ్చినా, గొర్రెలిచ్చినా, కులాలవారీగా తయిలాలిచ్చినా గెలవలేరని అన్నారు. ఎన్నికల్లో చూసుకుందాం రండి అని అన్నారు.

దళితుల ఓట్ల మీద తప్ప హుజూరాబాద్ దళితులపై కేసీఆర్‌కు ప్రేమ లేదని ఈటల రాజేందర్ అన్నారు.కానీ మీరు నన్ను ఓడించేందుకు రూ.5వేల కోట్లయినా ఖర్చు చేస్తారట. ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా నా గెలుపును ఆపలేరు. నన్ను కాపాడుకుంటారా. చంపుకుంటారా మీ ఇష్టం. ఓట్ల మీద తప్ప ఎస్పీలపై కేసీఆర్‌కు ప్రేమ లేదు. తెరాస ఏమిచ్చినా తీసుకోండి, భాజపాకే ఓటేయండి, అని ఈటల రాజేందర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి :

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss