Monday, July 26, 2021

Latest Posts

మరి కొద్ది సేపట్లో బీజేపీలో చేరనున్న ఈటెల రాజేందర్‌

Etela Rajender To Join BJP Party Today

భూ కబ్జా ఆరోపణలతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర మంత్రివర్గ పదవి నుంచి తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను తొలగించారు. దీనితో మనస్తాపానికి గురయ్యిన ఈటెల శనివారం తన అసెంబ్లీ సీటుకు రాజీనామా చేశారు. శనివారం స్పీకర్‌ను ఉద్దేశించి రాసిన లేఖలో మాజీ మంత్రి హుజురాబాద్‌ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేశారు. టిఆర్‌ఎస్‌తో తన 19 ఏళ్ల అనుబంధాన్ని ముగించి గత వారం పార్టీకి రాజీనామా చేశారు.

ఇప్పుడు తాజాగా ఈటెల జాతీయ నాయకుల సమక్షంలో ఢిల్లీకి పయనమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈ రోజు ఈటెల బి‌జే‌పిలో చేరే అవకాశం ఉంది. ఇక ఈటెల రాజేందర్ తో పాటు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, రమేశ్‌ రాథోడ్, తుల ఉమతో పాటు ముఖ్యనేతలు మొత్తంగా 20 మంది వరకు బి‌జే‌పిలో చేరే అవకాశం కనిపిస్తుంది.

ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. ఇక రాజేందర్ బి‌జే‌పిలో చేరిన తరువాత వీరంతా తిరిగి 15న హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss