Thursday, December 2, 2021

Latest Posts

ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమోలో కనిపించిన అమ్మాయి ఎవరో తెలుసా?

Evaru Meelo Koteeswarudu Promo Actress Revealed

జూనియర్ ఎన్టీఆర్ బుల్లి తెర పై హోస్ట్ గా కనిపించబోతున్న షో ఎవరు మీలో కోటీశ్వరులు. జెమినీ టీవీ లో ప్రసారం కానున్న ఈ షో ఈ నెలలో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఈ షో కి సంబందించి ప్రోమోను విడుదల చేసింది జెమిని టి‌వి. ఈ ప్రోమో లో ఒక అమ్మాయిని తన స్కూల్ టీచర్ “ఏమవుతావు?” అని అడుగుతుంది. ఆ అమ్మాయి “అమ్మ అవుతాను” అని సమాధానం ఇస్తుంది. తర్వాత ఆ అమ్మాయి పెద్దయ్యి ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం కంటెస్టెంట్ గా వస్తుంది.

తాజాగా, జూనియర్ ఎన్టీఆర్ “మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారు?” అని అడగగా, “అమ్మ అవుతాను”, అనే సమాధానం చెబుతుంది. అయితే దీని వెనుక ఉన్న కథ ఎంతో తెలియాలి అంటే షో టి‌వి లో ప్రసారం అయ్యేవరకు వేచి చూడాల్సిందే. అయితే ఎన్‌టి‌ఆర్ తో పాటు ప్రోమోలో కనిపించిన ఈ అమ్మాయి ఎవరా అని అందరూ తెగ వెతికేస్తున్నారు. అయితే ఎన్‌టి‌ఆర్ తో పాటు కనిపించిన ఆ అమ్మాయి పేరు దక్షి గుత్తికొండ.

Dakshi Guttikonda

దక్షి ఒక హీరోయిన్, ఆమె రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ సినిమాలో నటించింది. అంతే కాదు ఆమె షార్ట్ ఫిలిమ్స్ లో, వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శేఖర్ సూరి దర్శకత్వంలో వస్తున్న ఒక వెబ్ సిరీస్ లో, అలాగే మల్లేశం సినిమా డైరెక్టర్ అన్వేష్ మైకేల్ దర్శకత్వంలో వస్తున్న మరొక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది దక్షి.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss