Wednesday, December 1, 2021

Latest Posts

మోదీ హెడ్‌లైన్ అండ్ బ్లాంక్ పేజి ఇచ్చారు – చిదంబరం

ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం విమర్శలు చేశారు.   లాక్‌డౌన్ కారణంగా పడిపోయిన ఇండియన్ ఎకానమీని ఆదుకోవడానికి మంగళవారం సాయంత్రం రూ.20లక్షల కోట్లు ఆర్ధిక  ప్యాకేజీ పై ‘ఒక హెడ్ లైన్ ఇఛ్చి.. ఖాళీ (బ్లాంక్) పేజీ చూపినట్టు’ ఈ ప్యాకేజీ ఉందన్నారు చిదంబరం.  మోదీ ప్రసంగం పై వరుస ట్వీట్లు చేసిన చిదంబరం ‘నిన్న ప్రధాని హెడ్‌లైన్ పెట్టి బ్లాంక్ పేజీ వదిలిపెట్టారు. మరో సారి నా రియాక్షన్ బ్లాంక్ గా వదిలిపెట్టేశా’ అని ట్వీట్ చేశారు.

అలాగే ఆర్ధిక శాఖ  మంత్రి నిర్మలాసీతారామన్ ఈ ‘పేజీని’ ఎలా భర్తీ చేస్తారో చూడాల్సి ఉందని, ఎకానమీ ఊతానికి ప్రభుత్వం జొప్పించే ప్రతి అదనపు రూపాయినీ తాము జాగ్రత్తగా లెక్కిస్తామన్నారు చిదంబరం. ఈ ప్యాకేజీ నుంచి ఏ రంగానికి ఎంత కేటాయిస్తారో చూస్తామని, ప్రభుత్వం మొదట పేదలు,ఆకలిగొన్నవారికి, వలస కూలీలకు ఏమేరకు ప్రయోజనం కలిగిస్తుందో చూడాల్సి ఉందన్నారు. రియల్ మనీ అంటున్నారు తొలుత అట్టడుగున ఉన్న 13 కోట్ల కుటుంబాలను ఆదుకోవలసిన అవసరం ఉంది అని చిదంబరం అన్నారు.

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss