Monday, May 10, 2021

Latest Posts

మండలి భవితవ్యంపై ఉత్కంఠ ..అసలేం జరుగుతోంది

ఏపీలో వికేంద్రీకరణ తదితర బిల్లులను శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపాలని చేసిన నిర్ణయం నేపథ్యంలో అసలు మండలిని రద్దు చేస్తే పోతుందన్న ఆలోచన వైసిపి నేతల్లో వచ్చింది. , సీఎం జగన్ మాటల్లో మండలి అవసరమా అనే ప్రశ్న తలెత్తడం తో ఆ దిశగా అడుగులు పడుతున్నాయని అర్ధం అవుతోంది. సోమవారం అసెంబ్లీ సమావేశం కూడా ఉన్నందున దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారన్న మాట వినిపిస్తోంది.

కాగా సోమవారం ఉదయం 9.30గంటలకు ఎపి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రివర్గం మండలి రద్దు పై చర్చించి,తీర్మానం ఆమోదిస్తుందని టాక్. తర్వాత 11గంటలకు జరిగే అసెంబ్లీ సమావేశంలో మండలి రద్దుపై తీర్మానం ఇచ్చి,ఆమోదిస్తారని అప్పుడు కేంద్రానికి పంపుతారని అంటున్నారు. ఇందుకోసం ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్లు భోగట్టా.

ఇక ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ శాసన మండలి రద్దు అంశంపై సోమవారం పునః సమీక్ష చేసి తమ నిర్ణయాన్ని పార్లమెంటుకు పంపుతామన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదిస్తే శాసన మండలి రద్దు అవుతుందని పేర్కొన్నారు. మొత్తానికి మండలి రద్దు అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అయింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss