Facebook Invests 43,574 Crores in Jio Ambani
అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన ఫేస్బుక్ మధ్య తాజాగా పెద్ద ఎఫ్‌డీఐ డీల్ కుదిరింది. జియోలో 9.9 శాతం వాటాను ఫేస్బుక్ కొనుగోలు చేసింది. ఇండియాలోనే అతి పెద్ద డిల్ గా దీనిని చెప్పవచ్చు. దీని విలువ రూ.43,574 కోట్లు (5.7 బిలియన్ డాలర్స్). ఈ డీల్ వల్ల అంబానీకి ఏకంగా రూ.43 కోట్లకుపైగా నిధులు లభించాయి. ఆర్ఐఎల్ రుణ భారాన్ని తగ్గించు కోవడానికి ఆ మొత్తాన్ని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇది ఒక్కటే కాకుండా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్కో కూడా విక్రయించాలని భావిస్తున్నారు. ఇలా ఈ రెండు డీల్స్ వల్ల రిలయన్స్ కు రూ.1.1 లక్షల కోట్లు లభించనున్నాయి.
ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో కోసం పెద్ద మొత్తంలోనే ఇన్వెస్ట్ చేశారు. వాటి కోసం రుణాలు కూడా పెద్ద మొత్తంలో తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం అంబానీ రుణ భారం తగ్గించుకోవడం తన తొలి లక్ష్యమని తెలిపారు. 2021 మార్చి నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రుణ రహిత కంపెనీగా మారుస్తామని ప్రకటించారు. దీంతో ఇప్పుడు ముకేశ్ అంబానీకి తన లక్ష్యం మరింత చేరువ అయ్యింది.