Tuesday, March 9, 2021

Latest Posts

జూమ్ ను రిప్లేస్ చేస్తానంటున్న ఫేస్‌బుక్‌ “మెసెంజర్ రూమ్స్”

వీడియో కాన్ఫరెన్స్‌ అంటే గుర్తుకు వచ్చేది జూమ్ యప్. ప్రైవేట్ సంస్థలే కాకుండా కొంతమంది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాధికారులు సైతం  వీడియో కాన్ఫరెన్స్‌ లకు దీనిని వాడే వారు. కానీ దేశ వ్యాప్తంగా ప్రస్తుతం జూమ్‌ యాప్‌ సెక్యూరిటీ పరంగా ప్రమాదకరమని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు వెంటనే ఈ యాప్‌ను ఉపయోగించడం మానేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. అందువల్ల ఇప్పుడు జూమ్ యప్ ను ఎవరు ఉపయో గించడం లేదు.

దేశం మొత్తం లాక్ డౌన్ ఉండటం వల్ల చాలా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాయి. అలాగే వారు మీటింగ్స్ పెట్టుకోవాలి అంటే జూమ్ యప్ కు ప్రత్యామ్నాయంగా వేరే వాటికోసం చూస్తున్నారు. అలాగే అనేక కంపెనీలు జూమ్‌ యాప్‌కు ప్రత్యామ్నాయంగా ఆధునాతన ఫీచర్స్‌తో ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌ జూమ్‌ యాప్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

‘మెసెంజర్ రూమ్స్’ పేరుతో తన మెసెంజర్ యాప్‌కు కొత్తగా వీడియో కాన్పరెన్స్‌ వెర్షన్‌ను జోడించింది. దీనిలో టైమ్‌ లిమిట్‌తో సంబంధం లేకుండా సంభాషణ కొనసాగించవచ్చు అంతేకాదు ఇందులో మరో విశేషం ఏమిటంటే సమావేశం కావాలనుకున్న వారికి ఫేస్‌బుక్ అకౌంట్ లేకపోయినా కూడా వినియోగదారులు తమ ‘మెసెంజర్‌ రూమ్స్‌’లోకి వారిని ఆహ్వానించవచ్చని తెలుస్తోంది.  అలాగే త్వరలోనే మెసెంజర్ రూమ్స్‌కి వర్చువల్ బ్యాగ్రౌండ్లను జోడిస్తామని తెలిపింది.  ప్రస్తుతం మెసెంజర్‌కు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్‌ను త్వరలోనే మిగతా అనుబంధ సంస్థలైన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో కూడా ప్రవేశపెడతామని ఫేస్‌బుక్ పేర్కొంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss