చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన ఇలాంటి సంఘటనలు చూస్తే జనాలు మూఢనమ్మకాలను ఎంతలా నమ్ముతున్నారో అర్ధం అవుతుంది. ఈ మూఢ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని దొంగ స్వామీజీలు, బాబాలు జనాలను మోసం చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన చిత్తూరు జిల్లాలోని కొత్తకోట మండలంలో చోటు చేసుకుంది. పూజల పేరిట ఘరానా మోసానికి పాల్పడ్డాడు ఓ దొంగ స్వామీజీ. వెంకట్ రెడ్డి అనే వ్యక్తి స్వామీజీ అవతారం ఎత్తి తన అనుచరుడు చరణ్‌తో కలసి దందాలకు పాల్పడుతుండేవాడు. ఈ క్రమంలో వెంకట్ రెడ్డి కన్ను స్థానికంగా ఉన్న కృష్ణా రెడ్డి కుటుంబం మీద పడింది.
ఈ క్రమంలో మీ బిడ్డను ఫలానా వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాలి. లేకుంటే కుటుంబంలో ప్రాణ నష్టం తప్పదు అని వెంకట్ రెడ్డి.. కృష్టా రెడ్డిని నమ్మించాడు. అతడి మాటలు విని నిజమే అనుకొని కృష్టా రెడ్డి మెడిసిన్ చేస్తోన్న తన కుమార్తెని వెంకటరెడ్డి అనుచరుడు చరణ్‌కి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇక పెళ్లైన కొద్ది రోజులకే చరణ్ భార్యను చిత్ర హింసలకు గురిచేయడం ప్రారంభించాడు. దీనితో మోసపోయామని తెలిసి కృష్టా రెడ్డి కుటుంబం పోలీసులకు పిర్యాదు చేసింది.
ఇవి కూడా చదవండి: