Famous Kedarnath Temple doors open today
ప్రముఖ కేదార్నాథ్ ఆలయం తలుపులు ఈ రోజు ఉదయం 6.10 గంటలకు తెరుచుకున్నాయి. తొలి పూజాగా ప్రధాని నరేంద్ర మోదీ పేరిట మహాశివునికి రుద్రాభిషేకం నిర్వహించారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఐదుగురు పండితులు.. పంచముఖి డోలీ యాత్రను నిర్వహించారు. ఆరునెలల పాటు మంచులో కప్పబడి ఉన్న కేదార్నాథ్ ఆలయాన్ని బుధవారం ఉదయం తిరిగి తెరిచారు. పంచముఖి ప్రధాన పూజారి శివశంకర్ లింగా తలుపులు తెరిచే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఆరాధన సమయంలో సామాజిక దూరం పాటించారు. కరోనా విపత్తు ముగిసిన తరువాత చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుంది.
డోలీ యాత్రను ఆర్మీలోని కుమావో బెటాలియన్ ఏటా దీన్ని నిర్వహిస్తోంది. ప్రతీఏటా ఈ యాత్రలో వెయ్యి మందికి పైగా భక్తులు పాల్గొంటారు. కానీ ఇప్పుడు కరోనావైరస్ కారణంగా ప్రస్తుతం ఎవ్వరిని ఆలయం సందర్శించేందుకు అనుమతించలేదు. ఆలయం తలుపులు తెరవగానే భక్తుల క్యూ లేకపోవడం ఇదే మొదటిసారి. అలాగే యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్ ఆలయాల్ని తిరిగి తెరవాలనే ఆలోచన కేంద్రం చేస్తున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితులలో భక్తులను అనుమతించడం కష్టమే అంటున్నారు.