Thursday, December 2, 2021

Latest Posts

యూరియా కొరతతో బాధపడుతున్న రైతులు

నిజామాబాద్‌ జిల్లాలో యూరియా కొరత రైతులు బాధపడుతున్నారు. స్థానిక సొసైటీల వద్ద యూరియా కోసం రైతులు బారులు తిరి  రాత్రి, పగలు తేడా లేకుండా అక్కడే ఉండాల్సి వస్తోంది. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌ సొసైటీ వద్ద రాత్రి నుంచి క్యూలైన్‌లోనే రైతులు రాత్రింబవళ్ళు పడిగాపులు కాస్తున్నా పరిస్థితులు అక్కడ ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచు. దీనికి కారణం యూరియా సరఫరా తగ్గిపోవడం, వినియోగం పెరిగిపోవడంతో గత సీజన్‌ స్టాక్‌తో సర్దుబాటు చేస్తున్నా మంటున్నారు  అధికారులు. కాని కొందరు రైతులు మాత్రం యూరియా కొరతకు సొసైటీల అలసత్వం, అధికారులకు నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుపొలాలకు యూరియా చల్లాల్సిన సమయంలో చల్లాలి అలా కానీ పక్షంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు రైతులు. 15 రోజులకు పైగా  సొసైటీలో యూరియా లేకపోవడం దారుణమని, అధికారులు ఇప్పటికైనా స్పందించి, రైతులందరికీ సరిపడా యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss