Wednesday, June 23, 2021

Latest Posts

భయం గుప్పెట్లో భాగ్యనగరం

హైదరాబాద్ లో ఒక పక్క ప్రజలంతా కరోనాతో భయపడుతుంటే మరోపక్క హత్యలతో, దాడులతో ప్రజలంతా భయం గుపెట్లో గడపాల్సి వస్తుంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త త‌గ్గిన‌ట్లు తగ్గి మళ్లీ విజృంబిస్తుంది. అలాగే గడిచిన రెండు రోజులలో హైదరాబాద్ పరిదిలో నాలుగు హత్యలు జరగడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ఇంట్లో ఉంటే ఆర్ధిక ఇబ్బందులు బయటకు వస్తే ఒక పక్క కరోన మరోపక్క హత్యలు, దాడులు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.

కాగా నిన్న హైదరాబాద్ పరిదిలో ఓకే రోజు నాలుగు హత్యలు జరిగాయి. లంగర్‌హౌస్ లోని ఎండి లైన్స్‌లో ఓ కారుతో బైక్‌ను ఢీకొట్టి మహ్మద్‌ అనే వ్యక్తిని హత్య చేయగా,  గోల్కొండలో రాహుల్ అనే యువకుడిని అతని మిత్రుడు అజార్ హత్య చేశాడు. ఇలాంటి ఘటనే అటు రెయిన్ బజార్ లో కూడా జరిగింది. అలాగే  గోల్కొండ పోలీస్టేషన్‌ పరిధిలోనే షారుఖ్‌ అనే వ్యక్తి అర్భాజ్‌ సోదరిపై కామెంట్‌ చేయటంతో అతనిపై దాడి చేయడంతో  తీవ్రంగా గాయపడిన షారుఖ్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.  ఇలా పలు ప్రాంతాలలో కొన్ని వ్యక్తి గత దాడులు కూడా జరిగాయి. దీంతో జి‌హెచ్‌ఎం‌సి పరిదిలోని అన్నీ పోలీసు స్టేషన్లు అప్రమతం చేశారు పోలీసు అధికారులు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss