టాలీవుడ్ హీరో సచిన్ జోషీ పై పుణె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అతని బిజినెస్ పార్ట్నర్ పరాగ్ సంఘ్వి అతని పై కేసు పెట్టారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బిజినెస్ విషయంలో డబ్బులు చెల్లించక పోవడంతో సచిన్ జోషిపై కేసు నమోదైంది.
ఇక పూర్తి వివరాలు ఒక సారి చూస్తే పరాగ్ సంఘ్వి అతని ఫ్రెండ్ సచిన్ జోషీ కలిసి వైకింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అయితే ఈ ఒప్పందం ప్రకారం ఇంటర్నేషనల్ రిసార్ట్ కోరేగావ్ పార్కుకు రూ.58 కోట్ల రూపాయల రాయల్టీ చెల్లించాల్సి ఉంది. కానీ జోషి 2016 నుండి పరాగ్ సంఘ్వికి ఎటువంటి చెల్లింపులు చేయలేదు.
దీనితో ఈ విషయం పై సంఘ్వి పుణె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే ఇదేకాకుండా సచిన్ జోషికి చెందిన వైకింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యొక్క 30 మంది మాజీ ఉద్యోగులు జీతాలు చెల్లించలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇవి కూడా చదవండి: