Fire Accident In Vizag
వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనలో 12మంది మృత్యువాత పడిన సంగతి అందరికీ తెలిసిందే. గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి సమస్యలు తలెత్తి, పారిపోవడానికి కూడా వీల్లేక రోడ్ల మీదే పడిపోయారు. ఆ దృశ్యాలను చూసిన అక్కడ వారి హృదయం కదిలిపోయింది.
అయితే తాజాగా విశాఖపట్టణంలోని పరవాడ ఫార్మాసిటీలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి జేపీఆర్ ల్యాబ్స్‌లో గత అర్ధరాత్రి మూడు పేలుళ్లు సంభవించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాద సమయంలో అక్కడ 20 మంది కార్మికులు ఉన్నారు. ప్రమాదం తర్వాత అక్కడ పూర్తిగా పొగ కమ్ముకుంది. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: