Thursday, December 2, 2021

Latest Posts

ఉత్తర ఆఫ్రికాలో ఘోర అగ్నిప్రమాదం

Fires burn trees in Algeria

ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 42 మంది మృతిచెంది నట్లు అధికారులు వెల్లడించారు. అల్జీరియా కబైలియా రీజియన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పలు దఫాలుగా మంటలు చెలరేగడంతో 42 మంది మృతిచెందారు. మృతి చెందిన వారిలో 17 మంది సాధారణ పౌరులు 25 మంది సైనికులు ఉన్నారు. మంటల నుంచి సాధారణ ప్రజలను సైనికులు రక్షించారు. మంటలను అదుపు చేసే క్రమంలో సైనికులు సైతం మృత్యువాత పడ్డారు. అంతేకాకుండా ఆఫ్రికా లోని వేలాది ఎకరాల్లో ఉన్న ఆలివ్ తోటలు కూడా ధ్వంసమయ్యాయి.  అడవుల్లో మంటల కారణంగా జంతువులన్నీ రోడ్లపైకి పరుగులు తీస్తున్నాయి. ఇక ప్రస్తుతం అడవుల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ మజీద్ ప్రకటించారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss