Sunday, June 20, 2021

Latest Posts

అంతరిక్షంలో షూటింగ్ సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి

First Movie Shooting In Space

అంతరిక్షం గురించి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. చివరగా వరుణ్ తేజ్ హీరోగా ‘అంతరిక్షం’ పేరుతో ఓ సినిమా కూడా రావడం జరిగింది. అయితే హాలీవుడ్, ఇతర పరిశ్రమల్లో ఇలాంటి సినిమాలకు లెక్కే లేదు. ఇలాంటి చిత్రాన్నీ చూస్తున్నపుడు అంతరిక్షంలో ఉన్న భావనే కలుగుతుంది. కానీ వాస్తవానికి సెట్టింగ్స్ వేసి చిత్రీకరణ జరుపుతారు. గ్రాఫిక్స్ జోడించి మనకు అంతరిక్షంలో ఉన్న భావన కలిగిస్తారు.

ఎందుకంటే అంతరిక్షం కి వెళ్ళి షూటింగ్ తీయడం అంటే సాధ్యమయ్యే పని కాదు. అయితే ఆ అసాధ్యం ఇప్పుడు సుసాధ్యం కానున్నది. ఓ రష్యన్ సినిమా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయనున్నారు. ‘ఛాలెంజ్’ పేరుతో త్వరలోనే ఓ రష్యన్ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా చిత్రీకరణను అంతరిక్షంలోనే జరపనున్నారట. ఇందుకోసం చిత్ర బృందంలో అందరూ శిక్షణ కూడా పొందారట. అందరూ కలిసి రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి అక్కడే చిత్రీకరణ జరపనున్నారట.

ఈ సినిమాను క్లిమ్‌ షిఫెన్కో అనే దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. రష్యాకు చెందిన స్పేస్‌ ఏజెన్సీ రోస్‌కాస్మోస్‌ త్వరలోనే అంతరిక్షంలో ఈ చిత్ర షూటింగ్‌ జరపనున్నామని ప్రకటించింది. ఇందులో రష్యన్‌ నటి యూలియా పెరెసిల్డ్‌ ప్రధాన పాత్రలో నటించనుంది. ఈ ఏడాది అక్టోబరులో ఓ రష్యన్‌ రాకెట్‌ ద్వారా చిత్ర బృందాన్ని అంతరిక్షంలోకి పంపి అప్పుడే సినిమాను లాంచ్ చేయబోతున్నారట. అప్పటి వరకు చిత్ర బృందంలోని ముఖ్యులకు ఓ స్పేస్‌ ఏజెన్సీ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనుందట.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss