Home సినిమా వార్తలు వేట మొదలుపెట్టిన పుష్పరాజ్

వేట మొదలుపెట్టిన పుష్పరాజ్

First song from Allu Arjun's Pushpa

First song from Allu Arjun’s Pushpa

స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా హీరో హీరొయిన్లుగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారద్యంలో సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చెయ్యబోతున్నారు.  కాగా పుష్ప నుంచి ఫస్ట్ సాంగ్ ను ఈ రోజు ఐదు భాషల్లో విడుదలచేసారు. `దాక్కో దాక్కో మేక – పులొచ్చి కొరుకుతుంది పీక` అంటూ సాగే ఈ సాంగ్ దాదాపు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. చంద్రబోస్ అందించిన లిరిక్స్ సాంగ్‌కు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. ఈ సాంగ్ విడుదల చేసిన కొద్ది సమయంలోనే  4 లక్షల లైక్స్‌ ను సాధించడంతో తక్కువ సమయంలోనే అత్యధిక లైక్స్ సాధించిన ఏకైక లిరికల్ వీడియో సాంగ్‌గా రికార్డు సృష్టించింది. దీంతో బన్నీ ఫాన్స్ పుష్పరాజ్ రికార్డుల వేట మొదలు పెట్టాడు అని సంబరాలు చేసుకుంటున్నారు.

 

ఇది కూడా చదవండి:

Exit mobile version