First spitting case registered in Hyderabad
రాష్ట్రంలో కరోనా రోజురోజుకు విజ్రాంబిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని వాటిని కఠినంగా అమలుచేస్తుంది. దానిని ఉల్లంఘించిన వారిపై కేసులు కూడా నమోదు చేస్తోంది. రెండు రోజుల క్రితం రోడ్లు, సంస్థలు, ఆఫీసులు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం నేరమని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రోడ్డుపై ఉమ్మినందుకు మహ్మద్ అబ్దుల్ ముజేద్ అనే యువకుడికి షాకిచ్చారు హైదరాబాద్ పోలీసులు. హయత్ నగర్ చెక్ పోస్ట్ సమీపంలో పాల వాహనం నుంచి రోడ్డుపై ఉమ్మేస్తూ అతను అడ్డంగా దొరికిపోయాడు. దీనిని గుర్తించిన సరూర్‌నగర్ పోలీసులు ఆ యువకుడిపై సెక్షన్ 188, 269 కింద కేసులు పెట్టి అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తిని హయత్‌నగర్‌లోని అల్మగల్ కాలనీకి చెందిన డ్రైవర్ మహ్మద్ అబ్దుల్ ముజెడ్ (24) గా గుర్తించారు.