Tuesday, March 9, 2021

Latest Posts

ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ గుండెపోటుతో మృతి

ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ కామెంట్రేటర్ డీన్ జోన్స్ 59 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. ముంబయిలోని ఓ హోటల్లో ఉండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఐపీఎల్ పోటీలు యూఏఈలో జరుగుతూ ఉండడంతో ముంబయిలోని స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో కామెంట్రీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా జోన్స్ స్టార్ స్పోర్ట్స్ వ్యాఖ్యాతల బృందంలో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నారు. దక్షిణ ముంబయిలోని ఓ హోటల్ కారిడార్ లో ఇతర సహచరులతో ముచ్చటిస్తున్న ఆయన ఉదయం 11 గంటల సమయంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వెంటనే అంబులెన్స్ లో హరికిషన్ దాస్ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే జోన్స్ మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జోన్స్ మృతి చెందిన సమాచారాన్ని ఆస్ట్రేలియాలోని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

డీన్ జోన్స్ 80, 90వ దశకాల్లో అద్భుతమైన ఆటతీరుని కనిపించారు. 1984లో టెస్ట్ కెరీర్ ఆరంభించిన జోన్స్ 52 మ్యాచ్ లు ఆడి 11 సెంచరీలు, 14 అర్ధసెంచరీలతో 3,631 పరుగులు సాధించాడు. వన్డేల్లో 164 మ్యాచ్ లు లు ఆడి7 సెంచరీలు, 46 ఫిఫ్టీల సాయంతో 6,068 రన్స్ నమోదు చేశాడు. 1986-87 సీజన్ లో భారత పర్యటనకు వచ్చిన ఆసీస్ మద్రాస్ లో టెస్టు మ్యాచ్ ఆడింది. విపరీతమైన వేడి వాతావరణాన్ని తట్టుకుని నిలబడిన జోన్స్ 210 పరుగులు సాధించడాన్ని భారత అభిమానులు ఎవరూ మరువలేరు. ఇన్నింగ్స్ పూర్తీ అవ్వగానే హాస్పిటల్ కు వెళ్లి సెలైన్ ఎక్కించుకున్నానని గతంలో కూడా చెప్పారు డీన్ జోన్స్. ఆయన మృతిపై పలువురు ఆటగాళ్లు, క్రికెట్ లెజెండ్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss