Monday, May 10, 2021

Latest Posts

లాక్‌డౌన్‌ను అతిక్రమించిన మాజీ ముఖ్యమంత్రి

Former chief minister kumaraswamy defied lockdown

కరోనా విజ్రాంబిస్తున్న నేపథ్యంలో దానిని కట్టడి చేయాలంటే  లాక్‌డౌన్‌ను ఒక్కటే మార్గం అని కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ను అమలు చేస్తుంది. అందరూ లాక్‌డౌన్‌ కచ్చితంగా పాటించాలని అటు కేంద్ర ప్రభుత్వం మరియు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటూనే  ఉన్నాయి. అలాగే లాక్‌డౌన్‌ కాలంలో నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా వారు హెచ్చరిస్తున్నారు. అయితే కొందరు ఎవరెన్ని చెబుతున్నా లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్నారు.  వారిలో కరోనాపై సరైన అవగాహన లేని సామాన్యులే కాదు అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రముఖులు సైతం లాక్‌డౌన్‌ నియమాలను పాటించడం లేదు.

దానికి నిదర్శనం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు, హీరో నిఖిల్ వివాహం. నిఖిల్ వివాహం శుక్రవారం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. బెంగళూరు సమీపంలోని రామనగరలోని ఫాంహౌస్‌లో ఈ వివాహం జరిగింది. వివాహం లో దాదాపుగా 200 మందికి పైగా పల్గునట్లు తెలుస్తుంది. ఇది లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లఘించి నట్లే అని అంటున్నారు. పెళ్లికి వచ్చిన చాలా మంది మాస్క్‌ ధరించలేదు మరియు సామాజిక దూరాన్ని కూడా విస్మరించారు. ఇలాంటి సమయంలో అంతమంది ఓకే దగ్గర గుమ్మికుడటం సర్వత్ర చర్చనీయమైయింది.

అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన మాజీ సీఎం కుమారస్వామి లాక్‌డౌన్ సమయంలో తమ ఇంట్లో వివాహం జరిపించడం సరైంది కాదని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పెళ్లిళ్లు వాయిదా వేసుకోవడం మంచిదని ఆయన సూచించారు.  ఈ వివాహం పైన బాలీవుడ్ నటి రవీనా టాండెన్ కూడా ఫైర్ అయ్యారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోన్న తరుణంలో వివాహ వేడుక నిర్వహించడం ఏంటని ఆమె మండిపడ్డారు. ఇలాంటి సమయంలో పేదలు తమ కుటుంబ సభ్యులను చేరుకోలేక ఆకలితో అలమటిస్తున్నారు, కానీ ధనవంతులు మాత్రం నిబంధనలను అతిక్రమిస్తున్నారు అని అన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss