Former Chief of Intelligence AB venkateswara rao commands counter affair
ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంపై హైకోర్టు ధర్మాసనం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కాగానే పిటిషనర్‌ను బదిలీ చేసి, జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించిందని.. అనంతర కాలంలో హఠాత్తుగా సస్పెండ్ చేసిందని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. గత ఏడాది మే 30 నుంచి సస్పెండ్ చేసే నాటి వరకు జీతం ఇవ్వలేదని, సస్పెండ్ చేశాక ఎలాంటి భత్యం చెల్లించలేదని తెలిపారు. ఆయన్ను సస్పెండ్ చేస్తూ గత ఫిబ్రవరి 8న జీఏడీ జారీ చేసిన జీవో 18ని, గత మార్చి 17న క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్థించారు.
తనను రాష్ట్రప్రభుత్వం కక్షసాధింపు, దురుద్దేశంతోనే సస్పెండ్ చేసిందని, తిరిగి విధుల్లోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. తనను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన జీవోతో పాటు క్యాట్ జా రీ చేసిన ఉత్తర్వులను కూడా రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. సస్పెన్షన్‌కు ముందు అఖిలభారత సర్వీసు నిబంధనల మేరకు అభియోగాలను రూపొందించాల్సి ఉందని, కానీ అలాంటిదేమీ జరగలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, రాష్ట్రంలో ప్రభుత్వం మారినంత మాత్రాన ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయడం, జీత, భత్యాలను నిలిపివేయడం వంటివి సరికాదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ అ ఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్ర హోం కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నో టీసులు జారీ చేసింది. జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ ఎన్.జయసూర్యలతో కూడిన ధ ర్మాసనం ఈమేరకు ఆదేశిస్తూ, తదుపరి విచారణను పది రోజులకు వాయిదా వేసింది.