దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృబిస్తూనే ఉంది.ఈ మహమ్మారి సామన్యుల నుంచి సినీ రాజకీయ, క్రీడ ప్రముఖుల వరకు ఎవరినీ విడిచిపెట్టడం లేదు. తాజాగా భారత క్రికెట్ జట్టు మాజీ టెస్ట్ ఆటగాడికి కరోనా సోకింది. భారత మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ మంత్రి చేతన్ చౌహాన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఇటీవల ఆయనలో కోవిడ్ -19 లక్షణాలు కనిపించడంతో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షలో కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ నేపథ్యంలో చేతన్ చౌహాన్ ‘ఎస్జీపీజీఐ’ కి చెందిన కోవిడ్ హాస్పిటల్లో చేరినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. చౌహాన్ కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి :