Monday, May 10, 2021

Latest Posts

మాజీ సీఎం రూపు రేఖలు ఎలా మారాయో ?

ఇది మారు వేషం కానేకాదు. నిజంగా రూపే మారింది. అవును మొన్నటివరకూ చూడముచ్చటగా కనిపించిన జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, తాజాగా ఏ మాత్రం గుర్తు పట్టలేని రీతిలో మారిపోయారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. జమ్ముకశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370ను మార్చేసిన తర్వాత హౌస్ అరెస్టులోకి వెళ్లిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన వార్తలు పెద్దగా రావటం లేదు.

అయితే తాజాగా ఒక కశ్మీరీ జర్నలిస్టు ఒమర్ అబ్దుల్లా తాజా ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయటం ఆసక్తికరంగానే కాదు.. హాట్ టాపిక్ అయింది. షేవ్ క్లిన్ గా ఉండే తన రెగ్యులర్ రూపానికి భిన్నంగా గుబురు మీసాలతో, భారీగా పెరిగిన గడ్డంతో ఉన్న ఆయన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఎందుకంటే, తలకు మంకీ క్యాప్, నీలం రంగు కోటులో కురుస్తున్న మంచు మధ్యలో చిరునవ్వులు చిందిస్తున్న ఒమర్, రూపం చూసినంతనే ఆయన్ను ఏ మాత్రం పోల్చుకోని రీతిలో మారిపోయారని చెప్పాలి.

జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన నాటి నుంచి శ్రీనగర్ లోని హరి నివాస్ లో ఆయన్ను హౌస్ అరెస్టు చేసి ఉంచారు. ఇటీవలే ఆయన్ను పట్టణంలోని గుప్కార్ రోడ్డులో ఉన్న ఎం4 ప్రభుత్వ బంగ్లాకు మార్చారు. తన రోటీన్ రూపానికి భిన్నంగా భారీగా గడ్డాన్ని, మీసాల్ని పెంచటం వెనుక సీక్రెట్ మాత్రం ఎవరికీ అంతుబట్టడంలేదు. మోడీ సర్కారు తీరుకు నిరసనగానే ఆయనీ రూపంలోకి మారారని అంటున్నారు. మొత్తానికి బయటకు వచ్చి మాట్లాడితే కానీ దీనిపై క్లారిటీ ఉండదని అంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss