Monday, March 8, 2021

Latest Posts

సీనియర్ రాజకీయ నాయకుడు కన్నుమూత

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా పనిచేసిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జువ్వాడి రత్నాకర్‌రావు తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన  ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో రత్నాకర్‌రావు కరీంనగర్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో నిర్వహించనున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సీనియర్‌ నాయకుడిగా పేరుపొందీన ఆయన జగిత్యాల పంచాయతి సమితి అధ్యక్షుడిగా మరియు జగిత్యాల ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పలుమార్లు  పోటీ చేశారు. 2010 నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇది కూడా చదవండి: విశాఖ దుర్ఘటనపై స్పందించిన జనసేనాని పవన్ కల్యాణ్

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss