Monday, May 10, 2021

Latest Posts

మాజీ ప్రధాన మంత్రికి కరోనా ఎయిమ్స్ లో చేరిక

former pm manmohan singh admitted to aiims

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కోవిడ్  పాజిటివ్ వచ్చింది. దీనితో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) యొక్క ట్రామా సెంటర్‌లో ట్రీట్ మెంట్ కోసం చేరారు. కొద్దిపాటి జ్వరం వచ్చిన తరువాత కోవిడ్ పరీక్ష చేయించుకున్న అతనకి కరోనా సోకిందని తెలిసింది.

దేశంలోని కరోనావైరస్ పరిస్థితి పై శనివారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా కాంగ్రెస్ అగ్ర నాయకులతో జరిగిన సమావేశంలో మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు. భారతదేశంలోనే దాదాపు 1.8 లక్షల మంది మరణించిన ఈ మహమ్మారిని అంతం చేయడం కోసం పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ కార్మికులను కాపాడాలని మోడీని కోరారు.

వారిని రక్షించడం కోసం వారి వయసు 45 సంవాత్సరాల కన్నా తక్కువ ఉన్నా వారికి కూడా టీకా వేయాలని ఆయన చెప్పారు. ముందుగానే “తగినంత” వ్యాక్సిన్ ఆర్డర్లు ఇవ్వమని కేంద్రాన్ని కోరారు  మన్మోహన్ సింగ్.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss