Four Indian Army personnel killed in encounter with militants
ఒక పక్క కరోనతో యావత్ ప్రపంచం యుద్ధం చేస్తూంటే మరో పక్క మనదేశం మాత్రం ఒక పక్క కరోనాతో పాటు ఉగ్రవాదుల తోను యుద్ధం చేస్తున్నారు. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల రెండు రోజుల నుండి రెచ్చిపోతున్నారు. భారత జవాన్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు దిగారు. ఆదివారం ఉదయం హరిద్వారా సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు జవాన్లు మృతి చెంది నట్లు అధికారులు తెలిపారు.
వీరిలో కల్నల్ స్థాయి అధికారి కూడా ఉన్నారని సమాచారం. వెంటనే మన భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. కాగా గత 15 రోజులకుగా కశ్మీర్ సెక్టార్లో ఉగ్రవాదులు కాల్పులకు దిగుతున్న విషయం తెలిసిందే. తాజా ఎన్కౌంటర్తో భద్రతా బలగాలు మరింత అప్రమత్తం అయ్యాయి. నలుగురు జవాన్లు అమరవీరులు కావడంతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురి అయ్యింది. దేశం మొత్తం వాళ్ళకు నివాళులు ఆర్పిస్తున్నారు.