Tuesday, March 2, 2021

Latest Posts

మిర్ పేట లో దారుణం

Four members of a single family committed suicide at Meerpet

ఒకే కుటుంబంలో  నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం సాయంత్రం మిర్ పేట పోలీస్ స్టేషన్ పరిదిలో వెలుగుచూసింది. మృతుల్ని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హరీష్‌ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. మిర్ పేట పరిధిలోని అల్మాస్‌గూడలో ఒక అపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్తులో హరీష్‌ కుటుంబం నివాసముంటున్నారు.

హరీష్‌ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా  ఇంట్లోంచి బయటికి రాకపోవడంతో చుట్టుప్రక్కవారు అపార్ట్ మెంట్ మెంబర్స్ కు తెలిపారు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి  లోపలికి వెళ్ళి చూడగా మొత్తం నలుగురు విగతజీవులుగా కనిపించారు. మృతి చెందినవారు హరీష్‌, స్వప్న గిరీష్‌, సువర్ణగా పోలీసులు గుర్తించారు. వారు చనిపోతు రాసిన సూసైడ్ నోట్ ఒకటి పోలీసులకు లభించింది. వారికి ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగా నలుగురూ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss