Four teenagers have been gang raped on the girl in Quthbullapur
హైదరాబాద్‌లో చాలా కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తున్న వేళ మతిస్థిమితంలేని ఒక బాలిక పై కొందరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. అన్ని ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూస్తున్నారు. ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కూడా కొంతమంది కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. వరుసగా అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వివరాలలోకి వెళ్తే దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్‌లో మతిస్థిమితం సరిగా లేని బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఓ మతిస్థిమితం లేదని బాలిక ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా కుత్బుల్లాపూర్‌లోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక ఏప్రిల్ 20న ఇంటి నుంచి బయటకు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లింది. ఇదే అదునుగా చూసుకొని అదే ప్రాంతానికి చెందిన అక్బర్, జుమన్, గయాజ్, అలీంలు ఆమెను అనుసరించారు. ఆ తరువాత చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించి ఆ యువకులు సమీపంలోని ఓ పాడుపడిన భవనంలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితులు బాలికకు ఫోన్ ఇచ్చి కుటుంబసభ్యులతో మాట్లాడించారు. దీంతో వారు వెంటనే దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు రెండు గంటలలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా బాధితురాలు దేవేందర్‌నగర్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి చేరుకున్నా పోలీసులను చూసిన నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా నిదుతులలో ఓ వ్యక్తిని పట్టుకోగా మిగిలిన ముగ్గురు పరారయ్యారు. పట్టుకున్న వ్యక్తిచ్చిన సమాచారంతో మిగిలిన ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిపై కిడ్నాప్, అత్యాచారం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.