Saturday, September 19, 2020

Latest Posts

మందు బాబులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

ఏపీలో జగన్  ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేసింది. అయితే క్రమక్రమం...

ఆలయంలోకి ఏ మతం వాళ్లైనా రావొచ్చు టీటీడీ ఛైర్మన్

కరోన కారణంగా తిరుమల చరిత్రలోనే తొలిసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంలో జరుగనున్నాయి. శుక్రవారం సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం ఏకాంతంగానే జరిగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల బ్రహోత్సవాల్లో...

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

చారిత్రాత్మక తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. కరోనా సంక్షోభంలో సప్టెంబరు 21 వతేదీ నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటలను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకుల...

అనగనగా ఈ రోజు…!!

Freedom fighter potti sriramulu history:

ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఇదే రోజు  1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌన్, అణ్ణాపిళ్ళే వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు.  వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పడమటిపాలెం గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. ఆ తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు పూర్తి చేసిన ఆయన “గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే”లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసారు.

అప్పట్లో ఆయన జీతం నెలకు 250 రూపాయలు. 1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోవటం, తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోవటంతో 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు.స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ఈయన  1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించటం జరిగింది. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లోను, ఆంధ్రలో కృష్ణా జిల్లాలోని కొమరవోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్న ఈయన  కొమరవోలులో యెర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు.  1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించాడు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది. గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాకు కూడా ఉండేవి. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవాడు.

ఆంధ్ర రాష్ట్రసాధన దీక్ష విషయానికి వస్తే… మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు.

ఆఖరు రోజు ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు. కళ్లు తెరిచారు. అంతలోనే మూతలు పడపోయేవి. చేతులు కదిపేందుకు కూడా శక్తి లేదు. 54 పౌనుల (24.5 కేజీలు) బరువు తగ్గారు. నాడి కదలిక, శ్వాసతీరుల్లో మార్పు వచ్చింది. 16 గంటలపాటు మూత్రం స్తంభించింది. నోటిమాట కష్టమైంది. అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్లేవారు. సందర్శకులను నిలిపివేశారు. సాయంత్రం వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగిరాజు కృష్ణమరాజు, ఆయన సతీమణులతో మాట్లాడలేకపోయినా… చిరునవ్వుతో స్వాగతం పలికారు. అప్పటి నుంచి క్రమంగా శరీరం చల్లబడిపోయింది. రాత్రి 11.23 గంటలకు పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకొన్నాడు.ఆయన మరణ వార్త విన్న ప్రజలు ఆగ్రహావేశులైన హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన శవయాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి.

పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు. చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటన చేసాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్క రోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోటానికి వీల్లేదని మరునాడే వెళ్ళిపోవాలని చక్రవర్తుల రాజగోపాలాచారి తెగేసి చెప్పాడు. అయితే కాకతీయులు పాలించిన వరంగల్లు రాజధానిగా గుంటుందని అంబేద్కర్ సూచించారు. రాజమండ్రి కూడా మంచిదేనన్నారు. విజయవాడ కమ్యూనిస్టుల కంచు కోట కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వొప్పుకోలేదు. నెల్లూరు, చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా వున్న సౌకర్యం వదులుకోవాలా అని అలిగారు. కోస్తా వాళ్ళను మేము నమ్మం, జధాని రాయలసీమలోనే పెట్టాలని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని నీలం సంజీవరెడ్డి తదితరులు ఎదురుతిరిగారు. గత్యంతరంలేక కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు. బళ్ళారి, బరంపురం, హోస్పేట, తిరువళ్ళూరు లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచుకోవటం జరిగింది.  ఇదే తరహాలో ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కే‌సి‌ఆర్ గారు చేసిన దీక్ష ఫలితం గా ఆంధ్ర రాష్ట్రం నుండి విడిపోయి తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 న మరో కొత్త రాష్ట్రం గా ఆవిర్భవించింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మందు బాబులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

ఏపీలో జగన్  ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేసింది. అయితే క్రమక్రమం...

ఆలయంలోకి ఏ మతం వాళ్లైనా రావొచ్చు టీటీడీ ఛైర్మన్

కరోన కారణంగా తిరుమల చరిత్రలోనే తొలిసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంలో జరుగనున్నాయి. శుక్రవారం సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం ఏకాంతంగానే జరిగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల బ్రహోత్సవాల్లో...

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

చారిత్రాత్మక తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. కరోనా సంక్షోభంలో సప్టెంబరు 21 వతేదీ నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటలను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకుల...

Don't Miss

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

కంగనాకు సపోర్ట్ గా విశాల్ ట్వీట్

కంగనా రనౌత్... బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ లాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు ఉన్న ఒక ఆఫీసు ను ముంబై లో గవర్నమెంట్ అధికారులు అక్రమ కట్టడం అని చెప్పి కూల్చడానికి...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills