గబ్బర్ సింగ్ సినిమా పూర్తి అయ్యి 8 సంవత్సరాలు అయిన సందర్బంగా దర్శకుడు హరీష్ శంకర్ కు ప్రేక్షకులు నుంచి శుభాకాంక్షల వెల్లువ కురిసింది. కాగా ఒక ఆడియో ఫంక్షన్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ “నిన్నే కదా పోలాచి లో పవన్ కల్యాణ్ ఎంట్రీ సీన్ తీసింది. మొన్నే కదా పోలాచిలో అంత్యక్షరి సీన్ తీసింది అన్నట్టుగా ఉంది. సోషల్ మీడియా పుణ్యమా అని గబ్బర్ సింగ్ జ్నాపకాలు నాతోనే ఉన్నాయి. అప్పుడే ఎనిమిదేళ్లు అయ్యిందా గబ్బర్ సింగ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి” అని అన్నారు.
అదే రోజు నిన్న కావడంతో ఆయనకు ఫాన్స్ నుంచి ఊహించిన రెస్పాన్స్ అదేవిదంగా వచ్చింది. కాగా నిన్న హరీష్ శంకర్ తాను మళ్ళీ జత కట్టబోతున్నట్టు, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయబోతున్నట్టు తెలియచేసారు. దీనికి దేవి శ్రీ ప్రసాద్ స్పందిస్తూ “మీరు మంచి రోజున ఈ న్యూస్ విడుదల చేశారు, దీనితో రూఫ్ ని టచ్ చేసేంత నా ఎనేర్జీ పీక్స్ కి చేరింది. మీతో పని చెయ్యడం మంచి అనుభవాన్ని ఇస్తుంది.” అని అన్నారు.
ఇది కూడా చదవండి: మేక్ ఇన్ ఇండియా అంటోంది అల్లు అర్జున్ “పుష్పా” టీమ్