Wednesday, August 12, 2020

Latest Posts

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

నేను వైసీపీవాడినే | జనసేన ఎమ్మెల్యే రాపాక

నేను వైసీపీవాడినేనని, వైసీపీలోనే కొనసాగుతానని తాను గెలిచిన పార్టీపై జనసేన ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒరిజినల్‌గా వైసీపీవాడినేనని జనసేన గాలివాటం పార్టీ అంటూ ఈరోజు మలికిపురం మండలంలో గూడపల్లి...

హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా రోగి ఆత్మహత్య

ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా రోగి ఆత్మహత్య చేసుకోవడంతో నగరంలో ఒక్కసారిగా కలకలం రేపింది.  కరీంనగర్ జిల్లాకు చెందిన 60 ఏళ్ల వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో కొన్ని రోజుల క్రితం పరీక్షలు...

మారువేషంలో తిరుగుతూన్న వికాస్ దూబే అనుచరుడు అరెస్ట్

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అనుచరుడిని ఇవాళ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) పోలీసులు అత్యంత చక చక్యంగా పట్టుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో బాలగోవింద్ దూబే అలియాస్ లాలూ అనే వ్యక్తిని అదుపులోకి...

గద్దలకొండ గణేష్ రివ్యూ..!!

రివ్యూ టైటిల్ : గద్దలకొండ గణేష్
బ్యానర్ : 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌
తారాగణం : వరుణ్ తేజ్, పూజ హెగ్డే, అధర్వ మురళి, మృణాళిని రవి తదితరులు..
సంగీతం : మిక్కీ జె మేయర్
దర్శకత్వం : హరీష్ శంకర్
నిర్మాత : రామ్‌ ఆచంట, గోపీ ఆచంట
విడుదల తేదీ : 09-20-2019

వినూత్నమైన సినిమాలతో అలరిస్తూ హీరో గా రోజు రోజు కు తన క్రేజ్ ని పెంచుకుంటున్న హీరో వరుణ్ తేజ్.. మెగా హీరో గానే ఇండస్ట్రీ కి వచ్చినా తనకంటూ ఓ స్టైల్ ని ఏర్పరుచుకుంటున్న వరుణ్ తేజ్ విభిన్న పాత్రలు చేయడం లో దిట్ట.. F3 తో ఈ సంవత్సరం సూపర్ హిట్ కొట్టిన వరుణ్ తాజాగా నటిస్తున్న చిత్రం గద్దలకొండ గణేష్.. ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అవగా డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఏ రేంజ్ లో ఉందొ ఈ సమీక్షలో తెలుసుకుందాం..

కథ విషయానికొస్తే,

అభి (అధర్వ) అసిస్టెంట్ డైరెక్టర్. తనకు ఎదురైన చేదు అనుభవం వల్ల డైరెక్టర్‌గా మారాలనుకొంటాడు. కథాన్వేషణలో గద్దల కొండ గణేష్ (వరుణ్ తేజ్) అనే ఫ్యాక్షనిస్టు జీవితం తారసపడుతుంది. తన సినిమాకు సరైన కథ అనుకొంటాడు. గద్దల కొండకు వెళ్లి గణేష్ గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో గణేష్ ఫ్యాక్షన్ వ్యవహారాలు, హత్యలు, దొమ్మిలు ప్రత్యక్షం చూస్తాడు. ఈ నేపథ్యంలో నేరుగా గణేష్‌కు అభి దొరికిపోతాడు. తన జీవితాన్ని తెరకెక్కించే ప్రయత్నం తెలుసుకొని ఏకంగా ఆ సినిమాకు హీరోగా మారిపోతాడు.

నటీనటులు,

వరుణ్ తేజ్ చాలా బాగా నటించాడు. గ్యాంగ్ స్టర్ గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. కొన్ని కొన్ని చోట్ల నెగటివ్ షేడ్స్ వరుణ్ కి అంతగా సెట్ అవ్వకపోయినా ఒక నటుడిగా తన ప్రతిభను చాటే సినిమా ఇది. అథర్వ మురళి కూడా చాలా బాగా నటించాడు. వరుణ్ తేజ్ కి ధీటుగా తన పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. పూజ హెగ్డే ఈ సినిమాలో చాలా అందంగా కనిపించడం మాత్రమే కాక తన నటనతో కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. అయితే పూజ హెగ్డే పాత్ర కేవలం ఫ్లాష్ బ్యాక్ కే పరిమితమవ్వడం కొంత నిరాశ పరుస్తుంది. మృణాళిని రవి కూడా పూజ తో పోటీ పడుతూ తన వంతు నటనతో మంచి మార్కులు వేయించుకుంది.

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్టర్ గా మరోసారి తన మాస్ ఎలిమెంట్స్ ని కరెక్ట్ గా ప్రజెంట్ చేశాడు. ప్రతి సీన్ లో తన మార్క్ మేకింగ్ ని చూపించాడు. బోర్ కొట్టిస్తుంది అనేలేపే డైలాగ్స్ అలాగే పంచ్ లతో మంచి ఎనర్జీని తెప్పించాడు. వరుణ్ బాడీ లాంగ్వేజ్ ని దర్శకుడు చాలా బాగా వాడుకున్నాడు అనిపిస్తోంది. డైలాగ్స్ డెలివరీ అలాగే నెగిటివ్ షేడ్స్ ని సరికొత్తగా ప్రజెంట్ చేశాడు. మరో హీరో అథర్వ కూడా తన మార్క్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి మంచి బూస్ట్ ని అందించాయి. ఫస్ట్ హాఫ్ అలా అలా సాగినా సెకండ్ హాఫ్ డిఫరెంట్ ఎపిసోడ్స్ సినిమకు ఉపయోగపడ్డాయి. పెద్దగా అంచనాలు లేకుండా వెళితే మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ని చూసిన అనుభూతి కలుగుతుందని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్ :

వరుణ్ తేజ్

హరీష్ శంకర్ డైరెక్షన్

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

కామెడీ లేకపోవడం

సాగతీత

ఓవరాల్ గా :

ఓవరాల్ గా సినిమా చాల బాగుంది.. గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ సూపర్ హిట్ అందుకున్నాడు.. ఫ్లాష్ బ్యాగ్ లో వరుణ్ తేజ్ మరియు పూజ హెగ్డే ప్రేమ కథని చాలా బాగా తెరకెక్కించారు. వారి మధుర సన్నివేశాలు చాలా బాగుంటాయి. అప్పటిదాకా కథని చాలా కొత్తగా చూపించినప్పటికి క్లైమాక్స్ లో రొటీన్ గా మార్చేయడం కొంత నిరాశకు గురిచేస్తుంది. చివరగా ‘గద్దలకొండ గణేష్’ సినిమా ఒక మాస్ మసాలా మూవీ.

రేటింగ్ : 3/5

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

నేను వైసీపీవాడినే | జనసేన ఎమ్మెల్యే రాపాక

నేను వైసీపీవాడినేనని, వైసీపీలోనే కొనసాగుతానని తాను గెలిచిన పార్టీపై జనసేన ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒరిజినల్‌గా వైసీపీవాడినేనని జనసేన గాలివాటం పార్టీ అంటూ ఈరోజు మలికిపురం మండలంలో గూడపల్లి...

హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా రోగి ఆత్మహత్య

ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా రోగి ఆత్మహత్య చేసుకోవడంతో నగరంలో ఒక్కసారిగా కలకలం రేపింది.  కరీంనగర్ జిల్లాకు చెందిన 60 ఏళ్ల వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో కొన్ని రోజుల క్రితం పరీక్షలు...

మారువేషంలో తిరుగుతూన్న వికాస్ దూబే అనుచరుడు అరెస్ట్

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అనుచరుడిని ఇవాళ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) పోలీసులు అత్యంత చక చక్యంగా పట్టుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో బాలగోవింద్ దూబే అలియాస్ లాలూ అనే వ్యక్తిని అదుపులోకి...

Don't Miss

భారత సైనికులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు | పూనం కౌర్

రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది పూనం కౌర్. అయితే ఈ గడ్డు పరిస్తితులలో మన దేశ బార్డర్ వద్ద విధులు నిర్వహిస్తు ఈ దేశాన్ని కాపాడుతున్న భారత సైనికులందరికి తను రక్షా బంధన్...

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

KiaraAdvani Latest Pictures, New Images, Photos

KiaraAdvani Latest Pictures, New Images, Photos  

రూలర్  టైటిల్ ఎవరిది – సీక్రెట్  చెప్పేసిన బోయపాటి ….

సింహా,లయన్,లెజెండ్,డిక్టేటర్ ఇలా నందమూరి బాలయ్య టైటిల్స్ అదోలా ఉన్నా, కేచిగా ఉన్నాయి. ఇందులో  సింహా,లెజెండ్ సూపర్ హిట్ అయ్యాయి.  అదేకోవలో   బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీస్తున్న రూలర్ మూవీ పై ఫాన్స్ లో...

మోదీకి పాక్ ఉగ్ర వాదుల నుంచి ముప్పు?

భారత   ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందా అవుననే  ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది.  డిసెంబర్  22న ఢిల్లీలోని  రామ్‌లీలా మైదానంలో జరగనున్న ర్యాలీలో...